ఆకాశంలో
ఒళ్ళు విరుచుకున్న ప్రతిసారి
మేము కొత్తగా రూపుదిద్దుకుంటాం.
ఏరోజు గాయాలు
ఆ రోజుకి సమర్పించి
మమ్మల్ని మేము ఆకాశానికి, భూమికి
ఓ ఖాళీ కాగితంలా సమర్పించుకుంటాం.

మేము మా ఇళ్లను
ఎడ్ల బండ్లలో పిండంలా మోస్తాం.
మా పశుపక్షాదులతో
వందల వేల పాదముద్రలను రాలుస్తాం.
అవన్నీ పచ్చబొట్లుగా భూమి మీద ప్రత్యక్షమవుతాయి.

పురాతన నాగరికత నుండి
వందల ఎడ్లబండ్లు ఒకదానినోకటి
నీడలా పెనవేసుకుని, భూమికి వెన్నుముకలా
ఓ భూమధ్య రేఖను గీస్తాయి
మా పశుపక్షాదులు, మా నీడలతో కలిసి
ఇప్పుడు మాయమైపోయిన అడవులను,
పచ్చికబయిళ్ళను కనుగొంటాయి.
మాలో మేము ఎన్నో జ్ఞాపకాలను దాచి ఉంచాం.

ఆకాశం, భూమికి నడుమ
మా కథలు నెమ్మదిగా మేలుకొంటాయి

మా వాళ్ళు
తమ గాయపడిన దేహాలను కథలతో
బానిసగా మార్చే క్రమంలో
సొంత నేల మీద మేము ఎలా అపరిచితులైయ్యామో
తెలుస్తుంది.

మా పశుపక్షాదులు మాత్రం
దూరంగా మెరిసిపోతూ,
మాయ చేస్తున్న ఎండమావుల వైపు
గుడ్డిగా అడుగులేస్తాయి

Poem by Ramesh Karthik Nayak, Lambada Poet from Telengana
బంజారా – రమేశ్ కార్తీక్ నాయక్

Every time the sky
Cracks its back,
We make ourselves anew.
And, like plain sheets of paper
We offer ourselves,
To this land, and the sky.

We carry our homes in bullock carts
Like foetuses in a womb.
With cattle, fowl and flocks,
We leave behind a trail,
Of a million footprints, like
Patterns tattooed in the landscape.

From a civilization so ancient
Hundreds of our bullock carts
Have held each other.
Equator like, they moved in a line,
As though the land
Had a supporting spine.

Now, our cattle and sheep, with our shadows
Search for vanished forests and meadows.
We carry many memories within.
And our stories come to life
Between the land and the sky.

As we try to salve,
Our wounded bodies with stories
Of how we have come to be,
Strangers today, in our own land

Our cattle and flocks
Walking blindly towards
A deceptive mirage.

Poem by Ramesh Karthik Nayak, Lambada Poet from Telengana
Translated by Kabeer Kishan, Hyderabad.